Ugadi " 'పరాభవ' నామ సంవత్సరం ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా?

ఉగాది పండుగ నేడు అందరూ జరుపుకుంటారు.

Update: 2026-03-19 02:07 GMT

ఉగాది పండుగ నేడు అందరూ జరుపుకుంటారు. ఈ ఏడాది పరాభవ' నామ సంవత్సరం అంటే అందరిలోనూ పరాభవం అంటే అపజయం అనే పదం గుర్తుకు వస్తుంది. తెలుగు వారి పండుగలలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, మన ఆలోచనలను, ఆశయాలను కొత్తగా నిర్దేశించుకునే సమయం. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభం కాబోయే కొత్త ఏడాదికి 'పరాభవ' అనే పేరు ఉండటం చాలా మందిలో ఆసక్తిని, మరికొందరిలో ఆందోళనను కలిగిస్తోంది. సాధారణంగా 'పరాభవం' అంటే అవమానం లేదా ఓటమి అని మనం భావిస్తాం.. "కానీ, ఈ పేరు వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం తెలిస్తే, మనం ఈ ఏడాదిని ఎంత ఉత్సాహంగా ఆహ్వానించాలో అర్థమవుతుంది

'పరాభవ' అంటే ఏమిటి..?
సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక లోతైన భావం ఉంటుంది. 'పరాభవ అనే పదాన్ని విడదీసి చూస్తే.. పరా అంటే అత్యున్నతమైన, గొప్పదైన లేదా అతీతమైనది అని అర్థం. భవ: అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే, మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి, ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. మని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మనం ఎదుగుదల క్రమంలో పాత అలవాట్లను, పనికిరాని ఆలోచనలను వదిలేయడం అత్యవసరం. ఆ వదిలివేత'నే ఇక్కడ పరాభవంగా అభివర్ణించారంటారు.
ఆరు రుచులు.. జీవిత పాఠాలు...
గాది పచ్చడిలో ఆరు రుచులు ఎలాగైతే ఉంటాయో, జీవితంలో కూడా కష్టసుఖాలు అంతే సహజం."ఈ పరాభవ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయంస్వయం పరివర్తన. మనం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అడ్డుపడే బద్ధకాన్ని ఈ ఏడాది మనం ఓడించాలి. అది జరిగినప్పుడే మనం విజయం వైపు అడుగులు వేయగలం. మన మనస్సులో ఉండే నెగటివ్ ఆలోచనలను పరాభవం చేసి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలిల. 'నేను' అనే అహంకారాన్ని తగ్గించుకుని, వినయంతో కూడిన జ్ఞానాన్ని సంపాదించాలి.
"మార్పు ఎప్పుడూ చేదుగానే
ఉగాది పచ్చడిలో వేపపువ్వు చేదును కూడా మనం ఎందుకు ఇష్టంగా స్వీకరిస్తాం? ఎందుకంటే, ఆ చేదు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.." "అలాగే, జీవితంలో వచ్చే కొన్ని కఠినమైన మార్పులు ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించినా, అవి మనల్ని మరింత దృఢంగా మారుస్తాయి. 'విశ్వావసు' సంవత్సరంలో మనం నేర్చుకున్న పాఠాలను పునాదిగా చేసుకుని, ఈ 'పరాభవ' సంవత్సరంలో మనల్ని మనం ఒక కొత్త వ్యక్తిగా మలుచుకోవాలి.
కొత్త ఆరంభం...
2026 ఉగాది మనకు ఇచ్చే గొప్ప అవకాశం ఏమిటంటే – మనల్ని మనం పునర్ నిర్మించుకోవడం.. ఓటమిని చూసి కుంగిపోకుండా, దాన్ని గెలుపుకు మెట్టుగా మార్చుకోవడమే ఈ పరాభవ నామ సంవత్సర విశిష్టత.కటిని ఓడిస్తేనే కదా వెలుగు వచ్చేది.అలాగే మనలోని లోపాలను పరాభవం చేస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది. ఈ ఉగాది నాడు మొదలయ్యే పరాభవ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ...


Tags:    

Similar News