బ్రేకింగ్: పరీక్షలను రద్దు చేయకపోవడానికి కారణమిదే

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని, కొన్ని రద్దు చేశాయని [more]

Update: 2021-04-28 06:23 GMT

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని, కొన్ని రద్దు చేశాయని జగన్ తెలిపారు. కేవలం పరీక్షలు రద్దు చేసి పాస్ సర్టిఫికేట్ ఇస్తే భవిష్యత్ లో ఇతర రాష్ట్రాల పిల్లలతో పోటీ పడలేరని, మంచి కళాశాలలో సీటు దక్కడం కూడా కష్టమేనని జగన్ అన్నారు. యాభై సంవత్సరాల పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. పరీక్షలు రద్దు చేేయమని చెప్పడం సులువని, ఎవరైనా చెప్పవచ్చని, పిల్లలకు మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో పరీక్షలు నిర్వహించడం కష్టమని చెప్పారు. కష్టమైనా పరవాలేదని విద్యార్థులకు అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహిస్తామని జగన్ చెప్పారు.

Tags:    

Similar News