జగన్ సూటి ప్రశ్నకు మంత్రుల ఇరకాటం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులపై ఒకింత మండిపడ్డారని తెలుస్తోంది. మంత్రులు ఎక్కువగా సచివాలయానికి రావడం లేదన్న నివేదికతో జగన్ వారిపై అసహనం వ్యక్తం చేశారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులపై ఒకింత మండిపడ్డారని తెలుస్తోంది. మంత్రులు ఎక్కువగా సచివాలయానికి రావడం లేదన్న నివేదికతో జగన్ వారిపై అసహనం వ్యక్తం చేశారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులపై ఒకింత మండిపడ్డారని తెలుస్తోంది. మంత్రులు ఎక్కువగా సచివాలయానికి రావడం లేదన్న నివేదికతో జగన్ వారిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మంత్రుల పేషీల వద్దకు విజ్ఞప్తులు ఇచ్చేందుకు వస్తున్న వారు నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు. కొందరు మంత్రులు ఎక్కువగా జిల్లాల్లోనే ఉంటున్నారని, అమరావతికి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నారన్న సమాచారంతో జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఇకపై మంత్రులందరూ విధిగా ప్రతి మంగళవారం, బుధవారం సచివాలయంలో అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన కొందరు మంత్రులు ఎక్కువగా సచివాలయానికి రాకపోవడంపై జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది.