ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా?

దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపీలో అమలవుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఆయన ఖండించారు. ఏపీలో [more]

Update: 2020-10-31 06:10 GMT

దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపీలో అమలవుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఆయన ఖండించారు. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? అని యనమల ప్రశ్నించారు. ఏపీకి జగన్ ప్రత్యేక చట్టాన్ని రూపొందించినట్లుందని తెలిపారు. ప్రాధమిక హక్కులను కూడా జగన్ అణిచి వేస్తున్నారని అన్నారు. అమరావతిలో రైతులు న్యాయం చేయాలని కోరితే అరెస్ట్ లుచేస్తారా? అని యనమల ప్రశ్నించారు. రైతులకు బేడీలు వేసి తీసుకెళ్తే దానిని నిరసించడం తప్పెలా అవుతుందన్నారు. జగన్ తన మొండి వైఖరిని మార్చుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని యనమల అన్నారు.

Tags:    

Similar News