మందబలం ఉందంటే కుదరదు.. వార్నింగ్ ఇచ్చిన యనమల

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని ఇష్టం వచ్చినట్లు పాలన చేస్తామంటే కుదరదని మాజీ మంత్రి యనమల రామకృ‌ష్ణుడు అన్నారు. వైసీపీ కార్యక్రమాల వల్లనే కరోనా వ్యాప్తి జరుగుతుందన్నారు. [more]

Update: 2020-04-22 07:09 GMT

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని ఇష్టం వచ్చినట్లు పాలన చేస్తామంటే కుదరదని మాజీ మంత్రి యనమల రామకృ‌ష్ణుడు అన్నారు. వైసీపీ కార్యక్రమాల వల్లనే కరోనా వ్యాప్తి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంట ప్యాకేజీలను ప్రకటించడం లేదన్నారు. కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలమయిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలో కేరళ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. కేరళను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు మాని కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలన్నారు. ఇలాగే పాలన సాగితే రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు రారని యనమల అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా కట్టడి అంతంత మాత్రంగానే ఉందన్నారు.

Tags:    

Similar News