విజ‌య‌వాడ‌లో అస‌భ్య నృత్యాలు...అధికార పార్టీ నేత హ‌స్తం..?

Update: 2018-07-19 12:06 GMT

విజ‌య‌వాడ భవానీపురంలోని ఆలీవ్ ట్రీ హోటల్ పై అర్ధరాత్రి పోలీసుల దాడులు చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు జ‌రిపి ఐదుగురు మహిళలు, 50 మంది పురుషులను అదుపు లోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడి ఆధ్వ‌ర్యంలో పార్టీ నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి అసభ్య నృత్యాలు చేయించారు. అయితే, అప్ప‌టికే మరో ఐదుగురు యాంకర్లని తప్పించినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్, 15 మందిని భవానీపురం, 10 మందిని ఇబ్రహీంపట్నం, మరో పదిమంది ని గవర్నర్ పేట పిఎస్ లకు తరలించారు. ఐదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. పట్టుబడిన యువతులు హైదరాబాద్, భీమవరం, విహయవాడకు చెందిన వారిగా గుర్తించారు. పార్టీలో అధికార పార్టీకి చెందిన ఓ నేత కుటుంబ సభ్యుడిని తప్పించినట్లు సమాచారం. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యం. ప్రతినెలా ఇదే తరహాలో పార్టీలు జరుగుతున్నట్లు సమాచారం

Similar News