బ్రేకింగ్ : రేవంత్ పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని ఆయన తెలిపారు. తానే కాదని, [more]

Update: 2020-12-25 07:10 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని ఆయన తెలిపారు. తానే కాదని, పార్టీలో ఎవరూ ఉండరని వీహెచ్ జోస్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేసే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పీసీసీ చీఫ్ కు పనికి రారా? అని వీహెచ్ ప్రశ్నించారు. తాము మాత్రం జైలుకు తిరగాలా? అని నిలదీశారు. ఢిల్లీని కూడా రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారన్నారు. తెలంగాణ వ్యతిరేకికి పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారని వీహెచ్ ప్రశ్నించారు. 2018 నుంచి తనకు సోనియా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి ఆ పార్టీని ఖతం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా ఖతం చేస్తారని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News