రామన్నా... ఇలా అయిపోయావేందన్నా?

ఇప్పటి వరకూ మృదువుగా మాట్లాడే మంత్రి తారక రామారావు కూడా హై రేంజ్ లో ఫైర్ అవుతున్నారు

Update: 2022-12-22 04:25 GMT

ఎప్పుడూ లేనిది బీఆర్ఎస్ నేతల్లో ఫ్రస్టేషన్ మొదలయింది. ఇప్పటి వరకూ మృదువుగా మాట్లాడే మంత్రి తారక రామారావు కూడా హై రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కొన్ని అనకూడని పదాలు ఆయన నోటి నుంచి దొర్లుతున్నాయి. ఫ్రస్టేషన్ నుంచి వచ్చిన దానిలో భాగమేనంటున్నారు ఆయనను ఇన్నాళ్లూ దగ్గరగా చూసిన వ్యక్తులు. నిన్న గాక మొన్న కల్వకుంట్ల కవిత కూడా ఎన్నడూ లేని విధంగా చెప్పుతో కొడతానంటూ ఒక ఎంపీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అదే స్థాయిలో కేటీఆర్ సయితం బండి సంజయ్ పై ఫైర్ కావడం వెనక ఫ్రస్టేషన్ కారణమని పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.


బీజేపీ ప్రయత్నాలు...

కల్వకుంట్ల కుటుంబాన్ని బద్నాం చేయడానికి బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అవినీతి ముద్ర వేయడమే కాకుండా అనేక ఆరోపణలు చేస్తుంది. కేటీఆర్ కు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆయనకు అనేక మంది డ్రగ్స్ పంపిణీ చేసే వారితో సంబంధాలున్నాయని బీజేపీనేతలు విమర్శించారు. రక్త నమూనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరి చాలా రోజులయినా కేటీఆర్ ఇప్పుడ స్పందించమేంటన్న ప్రశ్న సహజంగానే పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆయన ఒకవైపు విసిగిపోయి కనిపిస్తున్నారని అంటున్నారు.
ఫ్రస్టేషన్ కు...
తండ్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడం, సోదరి కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వినిపించడం వంటి వాటితో కేటీఆర్ లో అసహనం పెరిగిందంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా టార్గెట్ చేయడంతో ఆయన ఫ్రస్టేషన్ కు గురయ్యాడంటున్నారు. సోదరి కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పదే పదే వినిపించడం, ఈడీ విచారణ వంటి అంశాలు పార్టీకి మైనస్ తెచ్చి పెడతాయని కేటీఆర్ ఆందోళన చెందుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు అనేక నియోజకవర్గాల్లో విభేదాలు ఎక్కువగా ఉండటం. వర్కింగ్ ప్రెసిడెంట్ గా సెట్ చేయలేకపోతన్నానన్న ఆవేదనలో ఆయన ఉన్నారంటున్నారు.

బీజేపీ సక్సెస్ అయినట్లేనా?
దీనికి తోడు బీజేపీ రెచ్చగొట్లే వ్యాఖ్యలు రామన్నలో ఆగ్రహం కలిగించాయని చెబుతున్నారు. కేటీఆర్ ఉన్నత చదువులు చదివిన వ్యక్తి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా ఉన్న నేత. సెటైర్లు వేస్తారేమో కాని.. తిట్లకు, పరుష పదజాలానికి కేటీఆర్ దూరంగా ఉంటారన్నది ప్రతీతి. ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే కేటీఆర్ ఒక్కసారి అలా విరుచుకుపడటం, బండి సంజయ్ ను వ్యక్తిగతంగా దూషించడం వంటివి చూస్తే బీజేపీ నేతలు ఎలా ఫ్రస్టేషన్ కు గురి చేస్తున్నారో చెప్పకనే తెలుస్తుంది. ఒకరకంగా బీజేపీ ఈ విషయంలో సక్సెస్ అయిందనే అనుకోవాలి. నిజమో.. అబద్ధమో.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా కల్వకుంట్ల కుటుంబాన్ని ఫ్రస్టేషన్ కు గురి చేయడంలో కమలనాధులు తాము విజయం సాధించినట్లేనని భావిస్తున్నారు.


Tags:    

Similar News