శరద్ పవార్ తో థాక్రే…?

శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి బీజేపీకి దీటైన బదులివ్వాలన్న లక్ష్యంతో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. [more]

Update: 2019-11-11 08:43 GMT

శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి బీజేపీకి దీటైన బదులివ్వాలన్న లక్ష్యంతో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. అందుకే కొద్దిసేపటి క్రితం ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఉద్ధవ్ థాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వంలో భాగస్వామ్యుల అయ్యే విషయంలో వీరిద్దరూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ విషయంకూడా తేలితే బలనిరూపణ రేపే జరుపుకోవచ్చన్న ఉద్దేశ్యంతో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. లేకుంటే గవర్నర్ ను కలసి బలనిరూపణకు కొంత సమయం ఇవ్వాలని శివసేన కోరనుంది.

Tags:    

Similar News