బ్రేకింగ్ : టీటీడీలో దర్శనాలకు సిద్ధం.. పరిమిత సంఖ్యలో

తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ తర్వాత లాక్ డౌన్ మినహాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తిరుమల శ్రీవారి దర్శనాన్ని [more]

Update: 2020-05-14 07:51 GMT

తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ తర్వాత లాక్ డౌన్ మినహాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తిరుమల శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించినట్ల తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో కాకుండా పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతించాలని టీటీడీ ప్రణాళిక రచిస్తుంది. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసింది. గంటకు ఐదు వందల మందిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించాలని, 14 గంటల పాటు శ్రీవారి దర్శనం ఉంటుందని, రోజుకు ఏడు వేల మందికి మాత్రమే దర్శనం ఉండేలా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. తొలి మూడు రోజులు టీటీడీ ఉద్యోగులకు, తర్వాత తిరుమల, తిరుపతిలో ఉండే స్థానికులకు దర్శనం అవకాశం కల్పిస్తారు. ప్రయోగాత్మకంగా దర్శనాన్ని ప్రారంభించి కరోనా వ్యాప్తి పూర్తిగా కనుమరుగైన తర్వాతనే ఆంక్షలను తొలగిస్తారు. ఆన్ లైన్ లో టిక్కెట్లను విక్రయించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనాలను నిలిపివేసి 56 రోజులు గడుస్తుంది. దర్శనాలను ఎప్పుడు ప్రారంభించేది ఇంకా నిర్ణయించలేదు. ప్రయోగాత్మకంగా తొలి పదిహేనురోజులు చిత్తూరు జిల్లా వాసులకే దర్శనాన్ని పరిమితం చేయనున్నారు.

Tags:    

Similar News