తర్వాత అరెస్ట్ ఎవరు?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న వారిలో టెన్షన్ మొదలయింది. సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్‌లపై దృష్టి పెట్టారు

Update: 2023-02-12 03:45 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న వారిలో టెన్షన్ మొదలయింది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్‌లపై దృష్టి పెట్టారు. సీబీఐ ఇప్పటి వరకూ ఇద్దరిని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారీగా ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వినిపించాయి. దీనిపై సీబీఐ, ఈడీలు పలువురిని విచారించాయి. పలుచోట్ల తనిఖీలు నిర్వహించాయి.

రాజకీయంగా...
ఇప్పటి వరకూ వ్యాపారవేత్తలకే పరిమితమైన అరెస్ట్‌లు రాజకీయ నేతల వరకూ వచ్చాయి. తాజాగా వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వారి విషయంలో దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయా? అన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. మాగుంట రాఘవ అరెస్ట్ సమయంలో జారీ చేసిన ఛార్జిషీట్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉంది.
పెద్దయెత్తున...
ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే ఒకసారి సీబీఐ అధికారులు విచారించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందాయని, దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి అరెస్ట్ ఎవరు అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీబీఐ, ఈడీలు వేర్వేరుగా దర్యాప్తు జరిపినా అరెస్ట్ ల విషయంలో మాత్రం రెండు సంస్థలు ఇటీవల కాలంలో స్పీడ్ పెంచడంతో పొలిటికల్ లీడర్లలో ఆందోళన రేకెత్తిస్తుంది. తదుపరి అరెస్ట్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతుంది.


Tags:    

Similar News