వైసీపీ ఓట్లు చీల్చే టీడీపీ కుట్ర బహిర్గతం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన కుట్ర బహిరంగతమైంది. ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి [more]

Update: 2019-03-27 13:56 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన కుట్ర బహిరంగతమైంది. ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఓట్లు చీల్చేందుకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మనుషులు చేసిన కుట్రకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. పరమేశ్వరరెడ్డి అనే పయ్యావుల అనుచరుడు విశ్వనాధరెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేశారు. విశ్వేశ్వరరెడ్డి పేరును పోలి ఉండటంతో విశ్వనాధరెడ్డితో నామినేషన్ వేయించేందుకు బేరసారాలు జరిపారు. వైసీపీ ఫ్యాన్ గుర్తు, ప్రజాశాంతి పార్టీ హెలికాఫ్టర్ గుర్తు ఒకేలా ఉండటంతో ఓటర్లను గందరగోళపరిచి వైసీపీ ఓట్లను చీల్చాలని తాము అనుకుంటున్నట్లు పరమేశ్వరరెడ్డి చెప్పారు. కేఏ పాల్ డబ్బులకు ఆశపడుతున్నారని చెప్పారు. పయ్యావుల కేశవ్ ను కలిస్తే ఆయనే నామినేషన్ ప్రక్రియ మొత్తం చేసుకుంటారని, నామినేషన్ వేసినందుకు డబ్బు ఇస్తారని చెప్పారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవద్దని సైతం ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఈ ఆడియో బయటకు రావడం సంచలనంగా మారింది.

వైసీపీ ఓట్లను చీల్చడమే లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరకమైన కుట్ర జరిగినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండే పేర్లు ఉన్న వ్యక్తులతో ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ వేయించారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైసీపీ అభ్యర్థుల పేర్లు, టీడీపీ అభ్యర్థుల పేర్లు ఒకటే కావడం గమనార్హం. కనీసం వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు చీల్చాలనేది వీరి టార్గెట్ అని వైసీపీ ఆరోపిస్తోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా వైసీపీ అభ్యర్థుల పేర్లు ఉన్న టీడీపీ నాయకులే ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్లు వేశారు. అయితే, ప్రజాక్షేత్రంలో ధైర్యంగా వైసీపీ ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ దొంగ రాజకీయాలు చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల హెలికాఫ్టర్ గుర్తుపై వైసీపీ అభ్యంతరం చెప్పినప్పుడు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుపట్టడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ ఓట్లను భారీగా చీల్చింది. కొందరు టీఆర్ఎస్ అభ్యర్థులు ట్రక్కు గుర్తు వల్ల ఓడిపోయారు. చాలామందికి మెజారిటీ తక్కువ వచ్చింది. మరి, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News