టీడీపీ నోటీసుకు….?

అమరావతిలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను 14 పని దినాల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సెలవులతో కలిపి ఈ [more]

Update: 2019-07-10 06:08 GMT

అమరావతిలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను 14 పని దినాల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సెలవులతో కలిపి ఈ నెల 30వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శని, ఆదివారాలను సెలవు దినాలుగా ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. అదే రోజున వ్యవవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం విత్తనాల కొరత, కరవు పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడుల గురించి చర్చించాలని తెలుగుదేశం పార్టీ నోటీసు ఇచ్చింది. దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News