సీఎం కేసీఆర్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి రాసిన లేఖలు వెనక్కు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి రాసిన లేఖలు వెనక్కు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి రాసిన లేఖలు వెనక్కు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామిలు ఈ లేఖ రాశారు. కరవు జిల్లాపై కక్ష వద్దని లేఖలో కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఎందుకు అనుమతులు లేవని భావిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోవడం ఏపీ ప్రభుత్వ వైఫల్యమేనని వారు పేర్కొన్నారు. 2014 పునర్విభజన చట్టంలోనూ వెలిగొండ ప్రాజెక్టు పేరు ఉందన్న విసయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. కేంద్రానికి, కేఆర్ఎంబీకి రాసిన లేఖలను వెనక్కు తీసుకోవాలని కోరారు.