వైఎస్ జగన్ ఉగాది వేడుకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో వైఎస్ జగన్, భారతి దంపతులు పాల్గొన్నారు. అచ్చమైన పంచెకట్టు ధరించి వైఎస్ జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రాయ పంచకట్టులో కనిపించిన జగన్ ఉగాది వేడుకల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఉగాది అందరి కుటుంబాల్లో ఆనందం నింపాలని కోరారు.
ఈ ఏడాది శుభప్రదమంటూ...
ఈ సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని పండితులు చదివి వినిపించారు. ఈ ఉగాది తెలుగు ప్రజలకు అన్ని శుభాలను కలగు చేస్తుందని పండితులు తెలిపారు. అలాగే వైసీపీకి కూడా ఈ ఏడాది రాజకీయంగా మంచి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని తయారు చేసి వచ్చిన అతిధులందరికీ అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి.