Ugadi : ఉగాది వేడుకల్లో చంద్రబాబు.. పంచాగ శ్రవణం.. సత్కారాలు
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేదికపై జ్యోతిని వెలిగించి ఉగాది వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
ప్రముఖులకు సత్కారాలు...
ఉగాది పచ్చడిని ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పరుగులు పెడుతుందని చెప్పారు. అమరావతి విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని మాడుగుల ఫణీంద్ర శర్మ తెలిపారు. అలాగే ఈ ఏడాది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని పంచాంగ శ్రవణంలో వినిపించారు.