పవన్ లెక్కలతో బాబుకు చిక్కులు తప్పవా?

జనసేనతోనే వచ్చే ఎన్నికల్లో కలసి వెళ్లాలని టీడీపీ నేతలుకోరుకుంటున్నారు. వారు బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.

Update: 2022-01-01 03:01 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక లెక్కతో రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. ఆయన టీడీపీ నేతల మైండ్ ను సెట్ చేసి పారేశారు. జనసేనతోనే వచ్చే ఎన్నికల్లో కలసి వెళ్లాలని టీడీపీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. వారు బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇది పవన్ కల్యాణ్ కు తొలి విజయంగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి జనసేన లేకపోతే గెలుపు కష్టమన్న సీన్ ను గ్రౌండ్ లెవల్లో పవన్ క్రియేట్ చేయగలిగారు.

టీడీపీ నేతలంతా....
ఇప్పుడు తెలుగుదేశం నేతలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నది జనసేన తోడునే. ఇదే విషయాన్ని శాసనమండలి మాజీ ఛైర్మన్ దగ్గర నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వరకూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేతలగా వారి అభిప్రాయం కాకపోవచ్చు. స్థానిక పరిస్థితులను బట్టి జనసేనతో కలిస్తేనే టీడీపీకి విజయం దక్కుతుందన్న ఒక అంచనాకు వచ్చేశారు. ఇది చంద్రబాబుపై వత్తిడి పెంచే అంశమే.
అవసరం బాబుదే...
ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కంటే ఆయన అవసరం టీడీపీకి ఎక్కువగా ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కు వచ్చే ఎన్నికల్లో ఎటయినా ఇబ్బంది లేదు. యువకుడు కావడంతో రాజకీయ భవిష్యత్ ఉంది. చంద్రబాబు పరిస్థితి అలా కాదు. ఇదే బాబుకు చివరి ఎన్నికలు. వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలయితే పార్టీ ని క్లోజ్ చేసుకోవాల్సిందే. లోకేష్ నాయకత్వంపై కూడా నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఖచ్చితంగా పవన్ తో ప్రయాణాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే.
డామినేట్ చేసే స్థితిలో....
ఒకరకంగా పవన్ కల్యాణ్ కు ఇది సానుకూల అంశమే. సీట్ల కేటాయింపు నుంచి ఇతర విషయాల వరకూ టీడీపీని డామినేట్ చేసే అవకాశం దక్కింది. సైకిల్ పార్టీని కంట్రోల్ చేసే అవకాశాన్ని టీడీపీ నేతలే పవన్ కల్యాణ్ కు ఇస్తున్నారు. ఇప్పుడు పొత్తు కుదుర్చుకోవాలంటే పవన్ పెట్టే షరతులకు చంద్రబాబు అంగీకరించాల్సిందే. ఆయన కోరిన సీట్లు ఇవ్వాల్సిందే. అక్కడ సీనియర్ నేత ఉన్నా సరే పవన్ కు తలొగ్గక తప్పదు. అలాంటి పరిస్థితులను చంద్రబాబు తన అనుభవంతో ఎలా ఎదుర్కొంటారన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ దే పై చేయిగా కన్పిస్తుంది. కొత్త ఏడాడి చివరకు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News