ఇక ఫుల్లుగా తాగేయండి.. మందుబాబులకు కిక్కే

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2023-04-24 04:51 GMT

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. తమిళనాడులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆదాయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై విమర్శలు కూడా అంతే స్థాయిలో వినిపిస్తున్నాయి.

అన్ని ప్రాంతాల్లో...
ఇప్పటి వరకూ బార్లు, అనుమతి ఉన్న ప్రదేశాల్లోనే మద్యం సేవించాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయాన్ని మారుస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లోనూ మద్యాన్ని సేవించే అవకాశాన్ని మందుబాబులకు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సమావేశమందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కల్యాణ మండపాలు, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాల్లో మద్యం అందించేందుకు ప్రత్యేక లైసెన్సింగ్ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చింది.
ప్రభుత్వ నిర్ణయంపై....
జయలలిత గతంలో మద్యం అమ్మకాలపై తీసుకున్న కఠిన నిర్ణయాలను సమీక్షించి స్టాలిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వినపడుతున్నాయి. పర్యాటకులు ఇబ్బంది పడే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యల కారణంగా దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News