AP BJP : బీజేపీ వ్యూహం అదిరిందిగా.. సూపర్ ట్విస్ట్ ఉంటుందట
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ స్థానాలు పెంచడానికి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ స్థానాలు పెంచడానికి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది. దాదాపు 88 అసెంబ్లీ స్థానాలతో పాటు 23 పార్లమెంటు స్థానాలు కూడా పెరగడంతో తమకు లోక్ సభలో బలం పెరుగుతుందని భావిస్తుంది. మొన్నటి వరకూ 175 శాసనసభ నియోజకవర్గాలున్న దానిని 263కు చేర్చాలని నిర్ణయించింది. అలాగే 25 పార్లమెంటు స్థానాల నుంచి 38 స్థానాలకు పెరగనున్నాయి. ఇప్పటికే చిన్న రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడానికి అనేక కారణాలున్నాయి. తక్కువ స్థానాలున్న వాటిలో గెలిచి దేశంలో అధికారంలోకి వచ్చింది.
గణనీయంగా పెరగడంతో...
నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగితే వాటి పరిధి కూడా తగ్గుతుంది. అప్పుడు హిందూ ఓటు బ్యాంకు ఏకీకృతమవుతుందని అంచనాలో ఉంది. అలాగే ముస్లింలు బలంగా ఉండే నియోజకవర్గాలు కూడా విడిపోవడంతో పాటు ఇతర మతాలకు చెందిన వారు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా హిందూ ఓటు బ్యాంకు గెలుపును శాసిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే భారీగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుదల తమకు లాభమేనని బీజపీ భావిస్తుంది. అందుకు తగినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా వర్గీకరించే అవకాశముందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో...
2024 ఎన్నికల్లో బీజేపీ కేవలం పది అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేసి ఎనిమిది స్థానాలలో గెలిచింది. లోక్ సభ స్థానాల్లో ఆరింటిలో బీజేపీ పోటీ చేసింది. అందులో మూడుమాత్రమే గెలిచింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీచేయగా అందులో సీఎం రమేష్, శ్రీనివాసవర్మ, పురంధేశ్వరి గెలుపొందారు. శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈసారి పది నుంచి పన్నెండు స్థానాలకు పోటీ చేసే అవకాశముంది. కేంద్ర నాయకత్వం మరిన్ని స్థానాలు అడిగే అవకాశాలున్నాయని, ఈసారి ముప్ఫయి అసెంబ్లీ, పన్నెండు వరకూ లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ ముఖ్య నేత ఒకరు అనడం విశేషం.