బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు… లాక్ డౌన్ విధించినా?

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 96, 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 3029 మంది [more]

Update: 2020-05-18 03:55 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 96, 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 3029 మంది కరోనా కారణంగా మరణించారు. యాక్టివ్ కేసులు భారత్ లో 56316 ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారు 36, 823గా ఉంది. నాలుగోవిడత లాక్ డౌన్ లోకి ప్రవేశించినా భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 33 వేల కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పదివేలకు చేరుకుంది. ఈ ఒక్కరోజు 3,029 కొత్త కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News