షేక్ పేట్ ఎమ్మార్మో సుజాత భర్త ఆత్మహత్య
షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో తనపై కూడా కేసు పెడతారన్న [more]
షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో తనపై కూడా కేసు పెడతారన్న [more]
షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో తనపై కూడా కేసు పెడతారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే షేక్ పెట్ ఎమ్మార్వో సుజాత మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టారు. షేక్ పెట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. . ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు షేక్ పెట్ ఎమ్మార్వో సుజాత ఇంట్లో 30 లక్షల రూపాయల నగదు లభ్యమైంది. సుజాత తో పాటుగా భర్త అజయ్ ను కూడా పలుమార్లు అధికారులు విచారించారు. 30 లక్ష రూపాయల నగదు ఎక్కడ నుండి వచ్చింది అనే దానిపై సమాధానం చెప్పమని అడిగారు. డబ్బులకు సంబంధించి సరైన సమాధానం లేక పోవడంతో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ డబ్బుల ఈ వ్యవహారంలో తనపైన కూడా కేసు వస్తుందనే భయం అజయ్ ని వేధిస్తోంది. . ఈ నేపథ్యంలోనే అజయ్ ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో తన ఇంటి పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశాడు. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న అజయ్ ని వెంటనే ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అజయ్ మరణించాడు.