Telangana : సంక్షేమం - అభివృద్ధి బడ్జెట్ ఇది : మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు

Update: 2026-03-20 07:08 GMT

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని చెప్పారు.య తెలంగాణను నెంబరు వన్ రాష్ట్రంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లుగా చూపారు. మూలధన వ్యయం 47,267 కోట్లు గా చూపారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

వ్యవసాయం - 23,179 కోట్లు
విద్యాశాఖ - 26,674 కోట్లు
వైద్య శాఖ - 13,679 కోట్లు
షెడ్యూల్ కులాల సంక్షేమానికి - 11.784 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ - 33,688 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖ - 13,679 కోట్లు
చేనేత రంగం - 278 కోట్లు
మహిళ సంక్షేమం - 3,134 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమం -7937 కోట్లు
ఐటీ శాఖ - 874 కోట్లు
పరిశ్రమల శాఖ - 3,490 కోట్లు
బీసీ సంక్షేమం - 12,511 కోట్లు
నీటి పారుదల శాఖ - 22, 615 కోట్లు
రాజీవ్ యువ వికాసం - 6,000 కోట్లు
గృహ నిర్మాణ శాఖ - 7,430 కోట్లు
మైనారిటీ సంక్షేమం - 3,769 కోట్లు





Tags:    

Similar News