Revanth Reddy : వచ్చే ఏడాది నుంచి టెన్త్ పరీక్షలు ఉండవు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక విషయాలు తెలిపారు

Update: 2026-03-20 12:01 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక విషయాలు తెలిపారు. విద్యా విధానం పై కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ విద్యా పాలసీ అమలు చేస్తామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం తీసుకొస్తామని తెలిపారు. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవన్న రేవంత్ రెడ్డి, విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసు పై స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని, చట్టం ప్రకారం దర్యాప్తు జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

కక్ష సాధింపు ఉండదు...
కక్ష సాధింపు ఉండదని, ప్రతి చర్యకు ప్రభుత్వానికి ఒక ప్రాసెస్ ఉంటుందని, విచారణ ప్రకారం కాకుండా ఎవరికైనా కేసులు పెట్టలేమని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రావు నుంచి సమాచారం తీసుకుని దాని ఆధారంగా స్టేట్ మెంట్లు నమోదు చేశామన్న రేవంత్ రెడ్డి విచారణ జరుగుతున్నప్పుడు తాను సమీక్ష చేయడం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు క్లీన్ చిట్ రాలేదని, చక్రధర్ గౌడ్ కేసులోనే కోర్టులో ఊరట లభించిందని చెప్పారు. సిట్ విచారణలో ఎలాంటి రిలీఫ్ లేదని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
కేబినెట్ విస్తరణపై అన్నీ ఊహాగానాలే...
కేబినెట్ విస్తరణపై వస్తున్న ఊహాగానాలు తగవని, తాను ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి విస్తరణ కోసం కాదని, అజారుద్దీన్ ఎమ్మెల్సీ విషయానికి ఇంకా సమయం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు గవర్నర్ వద్ద తేల్చుకోవాలని సూచించిందన్న రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన ఆగదని, ముందుకు సాగుతుందని చెప్పారు. ఇబ్బంది పడే వారికి న్యాయం చేస్తామన్న రేవంత్ రెడ్డి మూసి పునరుజ్జీవం చారిత్రాత్మక అవసరమని చెప్పారు. నది ఉన్నచోటే కాపాడాలి, వేరే చోట సృష్టించలేమని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో చేసిన అప్పులకు ఇప్పుడు తాము వడ్డీలు చెల్లిస్తున్నామని, వారు చేసిన తప్పులకు బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి అన్నారు. చెవిలో పూలు పెట్టుకుని తప్పించుకోలేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఫార్ములా ఈ రేసు కేసులో...
ఫార్ములా ఈ రేసు కేసులో కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. హెల్త్ పాలసీ పేరుతో అవినీతి ఆరోపణలు అవాస్తవమని, ఆ భూమిని అమ్మినా లక్ష కోట్లు రావని చెప్పారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు తెలుసునన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల్లా తప్పుడు ఆలోచనలు చేయమన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా టెలరేషన్ కార్డు దారులందరికీ వర్తిస్తుందని అన్నారు. జీవన్ రెడ్డి అంశాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి చూసుకుంటారని రేవంత్ రెడ్డి తెలిపారు. మహాత్మా గాంధీ ఎవరి సొత్తు కాదని ఆయన చెప్పారు. తాము ప్రజలకు జవాబుదారులమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News