వీహెచ్ అంటే నాకు గౌరవం

పీసీసీ చీఫ్ గా ఎంపికయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును కలిశారు. ఆయనను పరామర్శించారు. వీహెచ్ ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో పరామర్శించడానికి వచ్చాననని [more]

Update: 2021-06-28 06:47 GMT

పీసీసీ చీఫ్ గా ఎంపికయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును కలిశారు. ఆయనను పరామర్శించారు. వీహెచ్ ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో పరామర్శించడానికి వచ్చాననని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను వీహెచ్ సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. వీహెచ్ తనకు కొన్ని సూచనలు చేశారని, సీఎం కేసీఆర్ పై అలుపెరుగని పోరాటం చేయాలని చెప్పారన్నారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. వీహెచ్ అంటే తనకు గౌరవమని, ఆయన సలహాలను స్వీకరిస్తానని చెప్పారు.

Tags:    

Similar News