బేరసారాలు.. ఇంత అన్ ప్రొఫెషనల్ గానా?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. అయితే బీజేపీ మాత్రం దీనిని ట్రాష్ గా కొట్టి పారేస్తుంది.

Update: 2022-10-27 03:11 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. అయితే ఇది నిజంగా జరిగిందా? మునుగోడు ఉప ఎన్నికల కోసం జరిగిన డ్రామా? అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలు నలుగురిని ప్రలోభపర్చేందుకు, ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ మారేందుకు బేరసారాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసుల విచారణ జరుగుతుంది. అయితే బీజేపీ మాత్రం దీనిని ట్రాష్ గా కొట్టి పారేస్తుంది.

ముగ్గురు జంప్ చేసిన వారే...
బీజేపీలో కొనుగోలు చేయదలచుకున్న నలుగురి ఎమ్మెల్యేల్లో ముగ్గురు గతంలో పార్టీ మారిన వారే. హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వారు. గువ్వల బాలరాజు ఒక్కరే నికార్సయిన టీఆర్ఎస్ నేత. వీరి కోసం బీజేపీ అంత ప్రయత్నం చేస్తుందా? అదీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు వందల కోట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుందా? అంటే అవుననీ అనలేం. కాదనీ అనలేం. టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ అలా నడుస్తుంది.
పీకే సలహాతోనే...
పైగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సలహాతోనే ఈ డ్రామా జరిగినట్లు కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మునుగోడులు గెలుపుకోసమే అధికార టీఆర్ఎస్ ఈ ప్రయత్నం చేసిందని బీజేపీ చేస్తున్న ఆరోపణ. బీజేపీ ఇలాంటి రాజకీయ కొనుగోళ్లు చేయదు అంటే నమ్మలేం. చేయవచ్చు. కానీ నిజంగా చేయాలని అనుకుంటే ఇంత అమాయకత్వంగా చేస్తుందా? అన్న సందేహం కూడా కలుగుతుంది.


ఆయన ఫాం హౌస్ నే...?
కొనుగోలు చేయడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫాంహౌస్ నే ఎందుకు ఎంచుకుంటారు? నిజంగా చేయాలనుకుంటే పొరుగు ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలను ఎంచుకుంటారు. అంత అమాయకంగా, అన్ ఫ్రొఫొషనల్ గా బీజేపీ చేస్తుందా? ఖచ్చితంగా చేయదు అనే చెప్పాల్సి ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల వేళ జరిగిన ఈ రాజకీయ బేరసారాలు అనేక అనుమానం రేకెత్తిస్తున్నాయి. ఎవరూ కాటన్ సీడ్ కాదు. అలా అని అమ్ముడు పోరు అని కాదు. కానీ ఇంత అమాయకత్వంగా కొనుగోళ్లు బీజేపీ జరపరన్నది ఆ పార్టీ నేతల నమ్మకం. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News