ముగ్గురూ నిందితులే.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ

ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని ప్రేమిస్తే చివరికి బలయ్యేది ఎవరు అంటే అమ్మాయే… దీనికి ఉదాహరణ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు..తనకే దక్కాలని ఒకడు, నాకు [more]

Update: 2020-09-14 14:03 GMT

ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని ప్రేమిస్తే చివరికి బలయ్యేది ఎవరు అంటే అమ్మాయే… దీనికి ఉదాహరణ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు..తనకే దక్కాలని ఒకడు, నాకు దక్కకున్న పర్వాలేదు మరోకరి సొంతం కాకూడదనే స్వభావం మరోకడిది.. ఇద్దరు ఇష్ట పడుతున్నప్పుడు ఇప్పుడు నేను ఎందుకు సొంతం చేసుకుంటా అంటూ మరో మోసగాడు , ఈ ట్రై యాంగిల్ లవ్ స్టొరీ లో సతమతమై చివరికి ఆత్మహత్య శరణం అనుకున్న ఓ శ్రావణి ప్రేమ కథ.

అశోక్ రెడ్డి వ్యవహారం…..

బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో మలుపులు , ఆరోపణలు పై ప్రత్యారోపణలు మధ్య సాగిన పోలీసులు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. మొదటి నుండి ఊహించినట్లే ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రావణి స్నేహితుడు సాయి రెడ్డి గా తేల్చారు పోలీసులు. ఇక అనుకోకుండా ఈ కేసులో ఎంటర్ అయిన నిర్మాత అశోక్ రెడ్డి వ్యవహారం పై పూర్తి స్థాయి విచారణ చేయగా శ్రావణి ఆత్మహత్య కు పరోక్షంగా అశోక్ రెడ్డి కారణమని తేల్చి రెండో నిందితుడిగా అంటే ఈ కేసులో A2 గా పెట్టారు… ఇక శ్రావణి అత్యంత ఇష్ట పడి పెళ్లి చేసుకోవాలని భావించిన దేవరాజు రెడ్డి ని A3 గా తేల్చారు పోలీసులు.

2012 లో హైదరాబాద్ వచ్చి…..

ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 8 తేదీన సీరియల్ శ్రావణి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఆత్మ హత్య చేసుకున్న సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.. ఆత్మహత్య తరువాత పోలుసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో గంట గంటకు కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ముగ్గురు కలిసి ఓ అమ్మాయి ని ప్రేమిస్తే జరిగిన పరిణామాలే శ్రావణి ఆత్మహత్య ఉదాహరణ అని చెప్పుకొనేలా దారితీసిన పరిస్థితులు. శ్రావణి 2012 లో సినిమాలపై ఉన్న మక్కువ తో హైదరాబాద్ కి వచ్చింది , కొన్ని రోజులు ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్న తరువాత టెలివిజన్ రంగం లో అవకాశం రావడం తో సీరియల్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ వస్తోంది.. అయితే శ్రావణి ఇంటి సమీపంలో ఉండే సాయి కృష్ణ రెడ్డి అనే వ్యక్తి తో 2015లో పరిచయం ఏర్పడింది, మంచి స్నేహితులుగా ఉంటూ , సాయి కృష్ణ రెడ్డి శ్రావణి మంచి చెడులు చూసుకుంటు వచ్చాడు. ఈ గ్యాప్ లోనే RX100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి అనే వ్యక్తి 2017 లో పరిచయం ఏర్పడింది. అతను కూడా ఓ సీరియల్ , సినిమా ఆఫర్ ఇస్తాను అని చెప్పి శ్రావణి కి దగ్గర అయ్యాడు… ఇలా వీరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతున్న నేపద్యంలో టి క్ టాక్ మీద ఉన్న మోజు తో శ్రావణి రోజు తన వీడియోలు తీసి సోషియల్ మీడియలో పెట్టేది. ఇది చూసిన కాకినాడ కి చెందిన దేవరాజు రెడ్డి అనే వ్యక్తి శ్రావణి కి మెసేజ్ చేయడం , హయ్, బాయ్ చెపుతూ 2019లో పరిచయం అయి స్నేహంగా మారి , కొద్దీ రోజుల్లోనే ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది. దేవరాజు రెడ్డి ఎప్పుడైతే శ్రావణి కి దగ్గర అయ్యాడో అప్పుడు శ్రావణి సాయి, అశోక్ రెడ్డి ని దూరం పెడుతూ వస్తుంది.. దీంతో శ్రావణి ని నిలయదీయడం తో దేవరాజు తో ఉన్న ప్రేమ వ్యవహారం మొత్తం సాయి కి చెప్పింది శ్రావణి.

వేధింపులకు గురిచేయడంతో…..

అప్పటికే శ్రావణి పై పెంచుకున్న ప్రేమ , మరొకరి చేతుల్లోకి వెళుతుందని సాయి భావించాడు. దేవరాజు తో దగ్గర అవ్వడాన్ని సహించలేక పోయాడు. దీంతో దేవరాజు , శ్రావణి ప్రేమ వ్యవహారం పై ఉన్నది లేనిది కల్పించి శ్రావణి తల్లిదండ్రులు ముందు పెట్టాడు సాయి కృష్ణ రెడ్డి.. దీంతో తల్లిదండ్రులు శ్రావణి ని మందలిస్తూ వస్తున్నారు. అయిన శ్రావణి లో మార్పు రాలేదు.. దేవరాజు ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇక తనకు శ్రావణి దక్కదు అని భావించి సాయి , నిర్మాత అశోక్ రెడ్డి తో కలిసి శ్రావణి ని వేధింపులు కు గురి చేస్తూ వస్తున్నారు.. ఒకానొక సందర్భంలో శ్రావణి పై ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో దేవరాజు పై కేసు పెట్టించారు.. దేవరాజు నా వెంట పడుతున్నాడని, నన్ను వేధిస్తున్నాడు అని , దీంతో అప్పట్లో దేవరాజు పై కేసు నమోదు చేశారు పోలీసులు.

కుటుంబ సభ్యుల నుంచి వత్తిళ్లు….

ఇక ఒక వైపు తల్లిదండ్రులు, మరో వైపు సాయి కృష్ణ రెడ్డి , అశోక్ రెడ్డి వేధింపులు , ఒత్తిడి రోజు రోజుకు పెరిగాయి. ఎలాగైనా ఇంటి నుండి వెళ్ళిపోయి దేవరాజు ని పెళ్లి చేసుకోవాలని దేవరాజు తల్లికి విషయం చెప్పింది శ్రావణి , కానీ అప్పుడు దేవరాజు పెళ్లి కి నిరాకరించాడు. ఒకసారి శ్రావణి దేవరాజు కలిసి హోటల్ లో ఉన్నారు అని తెలిసి అక్కడి కి వెళ్లి సాయి రెడ్డి , శ్రావణి తమ్ముడు నడి రోడ్డు పై హంగామా చేశారు.. దేవరాజు పై దాడి చేశారు. ఈ వ్యవహారం పై దేవరాజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వీరి పై కేసు కూడా పెట్టినట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

బలయింది శ్రావణి……

ఈ ట్రయాంగిల్ లవ్ స్టొరీ లో సతమతమై శ్రావణి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. సాయి, అశోక్ రెడ్డి తో పాటు శ్రావణి ని తల్లిదండ్రులు కొంత ఇబ్బంది పెట్టారని , అవ్వని తమ విచారణ లో వెల్లడైంది తెలిపారు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్… ఇక ఈ కేసులో A1,A2 లుగా సాయి కృష్ణ రెడ్డి , అశోక్ రెడ్డి పేర్లు పెట్టగా , పెళ్లి పేరుతో మోసం చేయడం తో పాటు గతంలో ఉన్న కేసు ఆధారంగా దేవరాజు రెడ్డి పై A3 పెట్టినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో కొన్ని ఆడియోలు పరిశీలించమని, దేవరాజు ను శ్రావణి పెళ్లి చేసుక్కబోతుందని తెలిసి శ్రావణి తల్లిదండ్రులు తో పాటు సాయి కూడా దాడి చేసినట్లు శ్రావణి మాటల్లో అర్థమైంది అన్నారు..ఈ కేసులో దేవరాజు , సాయి కృష్ణ ను అరెస్ట్ చేశామని, అశోక్ రెడ్డి పరారు లో ఉన్నారని త్వరలో పట్టుకొని రిమాండ్ చేస్తామని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టొరీ లో కేవలం వేధింపులు తాళలేకే సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుందని తేలింది. ఇక దేవరాజు కూడా చాలా మంది అమ్మాయిలను టిక్ టాక్ లో పరిచయం చేసుకుని లోబర్చుకున్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి.. అలాంటి భాదితులు ఎవరైనా ఉంటే మాకు ఫిర్యాదు చేస్తే వాటి పై కూడా దర్యాప్తు చేస్తామన్నారు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్.. ఇలాంటి సోషియల్ మీడియా ఆకతాయిలపై అప్రమత్తంగా ఉండాలని , ప్రేమ పేరుతో మోసాలు కు పాల్పడే వారి పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు

Tags:    

Similar News