ఒక్కసారిగా అందరూ బయటకు రావడంతో?
నిన్న జనతా కర్ఫ్యూ తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ లో జనసంచారం ఎక్కువయింది. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు మార్కెట్ల వద్ద జనం క్యూ కట్టారు. ఈ నెల 31వ [more]
నిన్న జనతా కర్ఫ్యూ తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ లో జనసంచారం ఎక్కువయింది. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు మార్కెట్ల వద్ద జనం క్యూ కట్టారు. ఈ నెల 31వ [more]
నిన్న జనతా కర్ఫ్యూ తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ లో జనసంచారం ఎక్కువయింది. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు మార్కెట్ల వద్ద జనం క్యూ కట్టారు. ఈ నెల 31వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో నిత్యావసర వస్తువులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఒక్కసారిగా జనం రోడ్లపైకి వచ్చారు. ఇంటికి ఒక్కరే రావాలని సూచించినా ఆ నిబంధనను ఎక్కడా ప్రజలు పట్టించుకోలేదు. రోడ్లన్నీ కిక్కిరిసి పోయి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. పోలీసులు వాహనదారులను ఆపి కారణాలను తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. కరోనా వ్యాధి ప్రబలుతుందని ప్రభుత్వం చెప్పినా ప్రజలు పట్టించుకోకుండా బయటకు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.