Weather Report : ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్.. ఈసారి టాప్ లేచిపోద్ది

వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గింది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతన్నాయి

Update: 2026-02-03 02:24 GMT

వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గింది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న మొన్నటి వరకూ తెల్లవారు జామున వరకూ కొంత చలి తీవ్రత ఉండేది. కానీ ఈరోజు నుంచి తెల్లవారు జామున కూడా చలి కనుమరుగైంది. ఫిబ్రవరి నెలలోకి ప్రవేశించడంతో ఇక ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశముందని, మార్చి నాటికి మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

పొగమంచు తీవ్రత...
ఆంధ్రప్రదేశ్ లో ఉదయం వేళ ఇంకా పొగమంచు కురుస్తుంది. ఉదయం ఏడు గంటల వరకూ పొగమంచు తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. అదే సమయంలో ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయని, ఇప్పటికే 33 డిగ్రీలు నమోదవుతున్నాయిని, ఈ నెల చివరి నాటికి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల మాత్రం స్వల్పంగా చలిగాలులు వీస్తున్నాయి. అదీ ఏజెన్సీ ప్రాంతాల్లోనే. ఉక్కపోత కూడా బాగా మొదలయింది
రానున్న కాలంలో...
తెలంగాణలోనూ చలి గాలులు పూర్తిగా తగ్గిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండా కాలం ముందే వచ్చేసిందని చెబుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొగమంచు తీవ్రత కూడా తెలంగాణలో తగ్గింది. అయితే గరిష్టంగా ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదవుతున్నాయి. రానున్న కాలంలో మరింత ఎక్కువగా టెంపరేచర్స్ నమోదవుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వడ దెబ్బ తగులుతుందని తెలిపారు. అలాగే డీహైడ్రేషన్ కు గురి కాకుండా తగిన నీరును తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News