ఇదే మా యూత్ డిక్లరేషన్

తెలంగాణలో యూత్ డిక్లరేషన్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు

Update: 2023-05-08 12:39 GMT

తెలంగాణలో యూత్ డిక్లరేషన్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరిగిన నిరుద్యోగ సంఘర్షణ సభలో ఆయన ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు ఉద్యమానికి చిహ్నాలుగా నిలిచాయని రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీలు చైతన్యానికి కేంద్రాలని తెలిపారు. తెలంగాణ ఐదు శీర్షికల్లో తెలంగాణ యూత్ డిక్లరేషన్ ఉంటుందని తెలిపారు. మన రాష్ట్రం .. మన కొలువులు అన్న నినాదంతో విద్యార్థులు ఉద్యమించారన్నారు. తెలంగాణాలో జరుగుతున్న అన్యాయాన్ని యూనివర్సిటీలు నిలదీశాయని ఆయన పేర్కొన్నారు.

అమరవీరుల కుటుంబాలకు...
అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు నెలకు ఇరవై ఐదు వేల పింఛను ఇస్తామని తెలిపారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని స్వాతంత్ర్య ఉద్యమ కారులుగా గుర్తిస్తామని, అమర వీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. యువ మహిళ సాధికారికతను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కల్పిస్తామని అన్నారు.
జూన్ 2న నోటిఫికేషన్...
విద్యార్థుల నిరుద్యోగ యువత కోసం యూత కమిషన్ ను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది జూన్ 2న నోటిఫికేషన్ సెప్టంబరు నెలలో నియామక ఉత్తర్వులు ఇస్తామని రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. తెలంగాణ సమరయోధులపై ఉన్న అన్ని కేసును ఎత్తివేస్తామని తెలిపారు. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరీకి ఫీజు రీఎంబర్స్‌మెంట్ కింద ఫీజులు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. యువత అందరూ కాంగ్రెస్ గెలుపునకు సహకరించాలని ఆయన కోరారు.


Tags:    

Similar News