విపత్కర పరిస్థితుల్లో విమర్శలు చేయకూడదనే?

రుయా ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఆక్సిజన్ [more]

Update: 2021-05-12 00:56 GMT

రుయా ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఆక్సిజన్ కొరత ఉందని తెలిసినా అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కర్నూలు, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక మరిణించినప్పుడైనా ప్రభుత్వం మేల్కొనాల్సి ఉందన్నారు. తక్షణమే పరిస్థితులను చక్కిదిద్దేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో విమర్శలు చేయకూడదనే సంయమనం పాటిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు.

Tags:    

Similar News