కరోనా గురించి ప్రభుత్వం పట్టించుకోదా?

తన ఆరోగ్యం కుదుట పడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆయన చెప్పారు. వైద్యుల సలహా మేరకు తాను అన్నీ [more]

Update: 2021-04-19 00:57 GMT

తన ఆరోగ్యం కుదుట పడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆయన చెప్పారు. వైద్యుల సలహా మేరకు తాను అన్నీ పాటిస్తున్నానని, తన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితిపై పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత ఏర్పడటం ఆందోళన కల్గిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. పరిస్థితిని ప్రభుత్వం సరైన సమయంలో అంచనా వేయలేక పోయిందన్నారు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News