జనసైనికులకు సేనాని పిలుపు ఇదే

ఈ సమయంలో కూడా రాజకీయాలు చేస్తే ప్రజలు తిరగబడతారని జనసేన అధినేత పవన్ కల్యా‌ణ్ హెచ్చరించారు. ఆయన జనసేన కార్యకర్తలకు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. కరోనా [more]

Update: 2020-04-22 07:15 GMT

ఈ సమయంలో కూడా రాజకీయాలు చేస్తే ప్రజలు తిరగబడతారని జనసేన అధినేత పవన్ కల్యా‌ణ్ హెచ్చరించారు. ఆయన జనసేన కార్యకర్తలకు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో జనసేన కార్యకర్తలు చేస్తున్న సేవలను పవన్ కల్యాణ్ కొనియాడారు. కష్టసమయంలో ప్రజలు వెంట ఉన్న వారందరినీ తాము గమనిస్తున్నామని చెప్పారు. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందామని జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ఇప్పుడు పార్టీ దృష్టంతా ప్రజలను కష్ట కాలంలో ఎలా ఆదుకోవాలన్న దానిపైనే దృష్టి పెట్టాలన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని పిలుపు నిచ్చారు. కరోనాను తరిమేంత వరకూ శక్తియుక్తులు ఉపయోగిద్దామన్నారు పవన్ కల్యాణ్.

Tags:    

Similar News