పవన్ లుక్ మార్చాడోచ్!!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక వెయిట్ పెరగడమే కాదు…. గెడ్డం పెంచి ఎప్పుడూ రఫ్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్సులతో పంచె కట్టుతో [more]

Update: 2020-09-26 04:35 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక వెయిట్ పెరగడమే కాదు…. గెడ్డం పెంచి ఎప్పుడూ రఫ్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్సులతో పంచె కట్టుతో అదరగొడుతున్నాడు. కానీ సినిమాల్లోకి వచ్చాక అలాంటి లుక్ పనిచేయదు. సినిమాల్లో హీరోయిజం పండించాలంటే లుక్ మార్చాల్సిందే. కానీ వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ పెద్దగా మేకోవర్ అవ్వలేదు. జస్ట్ లాయర్ పాత్ర కాబట్టి మాములు లుక్ తోనే పవన్ నటించేసాడు. అయితే వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా, హరీష్ శంకర్ సినిమా, సురేందర్ రెడ్డి సినిమాలు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా లుక్ మార్చాలి కానీ పవన్ మాత్రం కరోనా లాక్ డౌన్ లో చాతుర్మాస దీక్ష అంటూ గెడ్డం బాగా పెంచి ఓ ఆధ్యాత్మిక వ్యక్తిలా తయారయ్యాడు. అలాంటి లుక్ లో పవన్ ని చూడం కష్టంగా ఉండేది.

అయితే పవన్ లుక్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్త విమర్శలు కూడా మొదలయ్యాయి. సినిమాల్లోకి వచ్చాక ఫిట్ నెస్ ఉండాలి. ఫేస్ లో గ్లో ఉండాలి. మరి పవన్ వర్కౌట్స్ మీద శ్రద్ద పెడితే బావుంటుంది అన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ మార్చేశాడు. గెడ్డం అవి తియ్యలేదు కానీ… టి షర్ట్ వేసుకుని కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. దీక్ష ముగించాడేమో.. పవన్ కాస్త స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వైట్ టి షర్ట్ లోనే కనబడుతున్నా.. పవన్ లుక్ కాస్త కొత్తగా కనిపించేసరికి పవన్ ఫాన్స్ కి ఎక్కడా ఆగడం లేదు., పవన్ లుక్ మర్చేసాడురోయ్ అంటూ హడావిడి మొదలెట్టేసాడు. అన్నట్టు వకీల్ సాబ్ షూట్ మొదలైంది. త్వరలోనే పవన్ కూడా వకీల్ సాబ్ షూట్ లో పాల్గొనబోతున్నాడట.

Tags:    

Similar News