KCR : సన్నాసులు సవాళ్లు విసురుతున్నారు.. అసెంబ్లీకి పంపేది ప్రజలా? వాళ్లా?

మరోసారి బీఆర్ఎస్ కు ఓటేసి ఆశీర్వదించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఇల్లెందు సభలో కోరారు

Update: 2023-11-01 11:25 GMT

అసెంబ్లీ గడప తొక్కనివ్వమని కొందరు సన్నాసులు సవాళ్లు విసురుతున్నారని, అసెంబ్లీకి పంపేది ప్రజలు అహంకారం ఉన్న నేతలా? అని కేసీఆర్ ప్రశ్నించారు. గిరిజనులకు పెద్దయెత్తున పోడు భూములు ఇచ్చామని తెలిపారు. ప్రలోభాలకు తలొగ్గి ఓటేయొద్దని తెలిపారు. బీఈర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు వచ్చాయో మీకు తెలుసునని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా మ్యానిఫేస్టో ఇస్తామని చెప్పకపోయినా ఇచ్చామని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇల్లందు పోరాటాల పురిటిగడ్డ అని అన్నారు. ధరణితో రైతుల భూమూల భద్రంగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.

మేనిఫేస్టోలో...
మేనిఫేస్టోలో తాను పెట్టింది పది పనులు చేసింది వంద పనులని ఆయన అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే నాలుగు కోట్ల ఎకరాల్లో వడ్లు పండుతాయని తెలిపారు. రేషన కార్డు దారులందరికీ సన్నబియ్యమే ఇస్తామని తెలిపారు. పింఛన్లను కూడా పెంచి ఇచ్చి పేదలను ఆదుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు తీసేస్తారన్నారు. ధరణిని కూడా తొలగిస్తారని అన్నారు. వాళ్లొస్తే మూడు గంటలు మాత్రమే కరెంట్ వస్తుందని, అదే ఈ ప్రభుత్వం ఉంటే ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు వస్తుందని ఆయన అన్నారు. ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోవాలని, విజ్ఞతతో ఓటు వేయాలని కేసీఆర్ ఇల్లందు ప్రజలకు పిలుపు నిచ్చారు.
అన్ని సమస్యలను...
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్ని సమస్యలను ఒక్కొక్కొటి పరిష్కరించుకుంటూ వెళదామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రెండు వందల పెన్షన్ మాత్రమే ఇచ్చారన్నారు. కర్ణాటక మంత్రి ఒకరు ఇక్కడకు వచ్చి ఐదు గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి వెళ్లారని, ఇక్కడ తాము ఆల్రెడీ 24 గంటల కరెంటు ఇస్తున్న విషయాన్ని వారు మర్చిపోయారన్నారు. లక్ష కుటుంబాలకు రైతు బీమా అందిందన్నారు. గిరిజనులకు 48 వేల ఎకరాల పోడు భూములను పంచి పెట్టామని తెలిపారు. వైద్య విధానంలో కూడా సమూలమైన మార్పులు తెచ్చామని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. మరోసారి తన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు.


Tags:    

Similar News