అసెంబ్లీలో ఉల్లి ఘాటు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉల్లి సెగ తగిలింది. ఉల్లి ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ నోటిసు ఇచ్చింది. అయితే దీనిని స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉల్లిపాయల [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉల్లి సెగ తగిలింది. ఉల్లి ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ నోటిసు ఇచ్చింది. అయితే దీనిని స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉల్లిపాయల [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉల్లి సెగ తగిలింది. ఉల్లి ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ నోటిసు ఇచ్చింది. అయితే దీనిని స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉల్లిపాయల గిఫ్ట్ ను టీడీపీ ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఇరవై ఐదు రూపాయలకే ఉల్లిని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకుని మరీ తాము ప్రజలకు తక్కువ ధరకు అందిస్తున్నామని జగన్ వివరించారు. చంద్రబాబు హెరిటేజ్ లో ఉల్లిపాయల ధర ఎంత ఉందో చెప్పాలని జగన్ నిలదీశారు. హెరిటేజ్ లో ఉల్లిపాయలు కేజీ రూ.200లకు విక్రయిస్తున్నారన్నారు. మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకునేందుకే ఉల్లిపాయలపై టీడీపీ రచ్చ రచ్చ చేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో ఉల్లిరైతులు తమ పొలాల్లోనే పడేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ దిగజారి వ్యవహరిస్తుందని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.