బ్రేకింగ్ : నిమ్మగడ్డ రమేష్ రివర్స్ కౌంటర్

నిన్న ప్రభుత్వం హైకోర్టులో వేసిన కౌంటర్ కు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నిన్న తన [more]

Update: 2020-04-19 13:48 GMT

నిన్న ప్రభుత్వం హైకోర్టులో వేసిన కౌంటర్ కు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నిన్న తన పిటీషన్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కు ప్రతిగా నిమ్మగడ్డ మరో పిటీషన్ దాఖలు చేశారు. తనను తొలగించడంపై పిటీషన్ లో ప్రస్తావించకుండా, కేవలం ఆర్డినెన్స్ ను మాత్రమే ప్రభుత్వం ప్రస్తావించడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు రాజ్యాంగ బద్దంగా జరిగిన నియామకంపై ప్రభుత్వం స్పందించలేదని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఆర్టికల్ 243 పరకారం ఎన్నికల కమిషనర్ ను తొలగించడం తప్పు అని అన్నారు. ప్రభుత్వం తనను కావాలనే తొలగించిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయిన తర్వాత తొలగింపు ఎందుకని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. రేపు హైకోర్టులో ఈ పిటీషన్లపై విచారణ్ జరగనుంది.

Tags:    

Similar News