తెలంగాణలో ఇంకో టీఆర్ఎస్

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు సమాచారం

Update: 2023-04-30 02:45 GMT

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు టీఆర్ఎస్ పేరుతో కేంద్ర ఎన్నిక సంఘానికి దరఖాస్తు చేరింది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారడంతో కొత్తగా టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చినట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీఆర్ఎస్‌గా కొత్త పార్టీ ఆవిర్భవించడం చర్చనీయాంశమైంది.

తెలంగాణ రాజ్య సమితిగా...
సిద్ధిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగా కొత్త టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. ఉపాధ్యక్షుడిగా తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా నల్లా శ్రీకాంత్, కోశాధికారిగా సదుపల్లి రాజు ఉన్నారని ఎన్నికల సంఘానికి పంపిన దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాజ్య సమితి పేరుతో వీరు ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశారు. కానీ బయటకు మాత్రం టీఆర్ఎస్ గా వినిపిస్తుంది.
మే 27వ తేదీ వరకూ...
ఈ పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలుంటే ముప్ఫయి రోజుల్లో తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అనేక భాషల్లో వివిధ పత్రికల్లో ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చింది. అభ్యంతరాలుంటే మే 27వ తేదీ వరకూ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పుకునే వీలుంది. తెలంగాణ రాజ్య సమితి పేరుతో కొత్త పార్టీ రిజిస్టర్ అయింది. ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశాలుండటంతో అధికార బీఆర్ఎస్ నుంచి అభ్యంతరాలు వెలువడే అవకాశముంది.


Tags:    

Similar News