ఉగ్రవాదానికి వ్యతిరేకంగా

ఐక్య రాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 130 కోట్ల మంది భారతీయుల తరుపున మాట్లాడుతున్నానన్నారు మోడీ. ఈ ఏడాది గాంధీ 150 జయంతి ఉత్సవాలు [more]

Update: 2019-09-27 14:22 GMT

ఐక్య రాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 130 కోట్ల మంది భారతీయుల తరుపున మాట్లాడుతున్నానన్నారు మోడీ. ఈ ఏడాది గాంధీ 150 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని అది ఎంతో సంతోషకరమన్నారు. రాబోయే ఐదేళ్లలో 15లక్షల కోట్ల మందికి మంచినీటిని అందిస్తామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించామని దాన్ని అమలు పరుస్తామని చెప్పారు మోడీ. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధేనని వ్యాఖ్యానించారు. 2025 వరకు భారత్ ను టీబీ రహిత దేశంగా మారుస్తామన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శమని, 2022 నాటికి పేదలకోసం మరో రెండుకోట్ల గృహాలను నిర్మిస్తామన్నారు నరేంద్రమోడీ. ఐక్య రాజ్యసమితిలో మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకంకావాలని, మా ప్రయత్నాలు ప్రపంచ దేశాలకు ఉపయోగపడాలని మోడీ పిలుపునిచ్చారు.

 

 

Tags:    

Similar News