Karnataka results : అపర కుబేరుడు వెనుకంజ

హోసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎంబీటీ నాగరాజు వెనుకంజలో ఉన్నారు.

Update: 2023-05-13 05:04 GMT

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఇక్కడ డబ్బులు ఏమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎంబీటీ నాగరాజు దేశంలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో అత్యధిక ధనవంతుడిగా పేరు పొందారు. ఆయన ఏం చదువుకోక పోయినా అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. దాదాపు 1,609 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు ఆయన తన ఎన్నికల అఫడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన భార్య పేరిట 536 కోట్లు, 1,073 కోట్ల స్థిరాస్థులు ఉన్నట్లు తెలిపారు. నాగరాజు, అతని భార్య పేరు మీద 98.36 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని కూడా అఫడవిట్‌లో పేర్కొన్నారు.

హోసకోటె నియోజకవర్గం నుంచి...
ఆయన హోసకోటె నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎంబీటీ నాగరాజు వెనుకంజలో ఉన్నారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కంటే వెనుకబడి పోవడంతో ఈ ఎన్నికలలో డబ్బులు కంటే పార్టీలకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతుంది. ఎంబీటీ నాగరాజు గతంలో ఓడిపోయినా ఆయనను ఎమ్మెల్సీ చేసి బీజేపీ మంత్రిని చేసింది. అత్యంత ధనవంతుడు వెనుకంజలో ఉండటంతో బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో నెగ్గుకుని రావడం కష్టమేనన్న్ విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News