మధ్యప్రదేశ్ గవర్నర్ మృతి

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ మృతి చెందారు. లాల్జీ టండన్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను కొద్దిరోజులుగా వెంటిలేటర్ [more]

Update: 2020-07-21 04:19 GMT

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ మృతి చెందారు. లాల్జీ టండన్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను కొద్దిరోజులుగా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 85 ఏళ్ల వయసున్న లాల్జీటండన్ భారతీయ జనతా పార్టీ హయాంలో మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. లాల్జీ టండన్ మృతి పట్ల ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లు సంతాపం ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ కు మధ్యప్రదేశ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు.

Tags:    

Similar News