April25-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళలను పొడిగించారు. ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరుగుతుండటంతో మెట్రో రైళ్ల వేళను పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రాత్రి పొద్దుపోయేంత వరకూ మ్యాచ్ జరగనుండటంతో ఎక్కువ మంది తమ ఇళ్లకు చేరుకోవడానికి సులువుగా మెట్రో రైళ్ల సమాయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-04-25 13:17 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Metro : నేడు మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళలను పొడిగించారు. ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరుగుతుండటంతో మెట్రో రైళ్ల వేళను పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రాత్రి పొద్దుపోయేంత వరకూ మ్యాచ్ జరగనుండటంతో ఎక్కువ మంది తమ ఇళ్లకు చేరుకోవడానికి సులువుగా మెట్రో రైళ్ల సమాయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh : పింఛను ఈ నెల అయినా ఇంటివద్దకు అందుతుందా? టీడీపీలో టెన్షన్

ఒకటో తేదీ వస్తుందంటే విపక్ష పార్టీలకు టెన్షన్ పట్టుకుంటుంది. ఈ నెల కూడా పింఛను ఇంటివద్దకు ఇవ్వకపోతే తమకు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన చెందుతున్నారు. గత పింఛను పంపిణీ ఆలస్యం కావడంతో గ్రామ సచివాలయాల వద్ద పంపిణీ చేయడంతో చాలా మంది వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడ్డారు.

Congress : ఏజెంట్లు కోసమేనా? కౌంటింగ్ కు కూడా ఉపయోగపడుతుందిగా బాసూ?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. రెండు ఏనుగులు పోటీపడుతుంటే కాంగ్రెస్ చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అభ్యర్థులయితే నియోజకవర్గాల్లో దొరికారు. అందుకు అనేక కారణాలున్నాయి. కొందరు వైసీపీలో టిక్కెట్ దొరకక కాంగ్రెస్ కండువా కప్పుకోగా, మరికొందరు పోలింగ్ రోజు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లవచ్చు.

IPL 2024 : దేవుడా... ముందుగా మాత్రం బ్యాటింగ్ రాకుండా చూడు సామీ

ఐపీఎల్ లో ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ హిస్టరీని క్రియేట్ చేన్తున్న ఆరెంజ్ ఆర్మీ మరోసారి తన బ్యాట్ కు పనిచెబుతుందా? అన్నది ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చనీయాంశమైంది. అసలే అది ఉప్పల్ స్టేడియం. అచ్చొచ్చిన వేదిక. అందులోనూ హోం గ్రౌండ్. ఇక వాళ్లను ఆపడం ఎవరికైనా సాధ్యమవుతుందా?

TDP : అన్నా లేడు.. పార్టీ లేదు.. ఏక్ నిరంజన్.. నో బ్లడ్ రిలేషన్

రాజకీయాలలో ఎవరి పదవులు వారికే ముఖ్యం. కుటుంబ సభ్యులలో అయినా పెద్దగా పట్టించుకోరు. తాము మాత్రమే పదవి పొందాలనుకుంటారు. ఇందులో రక్తసంబంధానికి ఏమాత్రం తావులేదు. భార్యాభర్తలు కూడా సీట్ల కోసం సిగపట్లు పడుతున్నారంటే రాజకీయాలంటే ఎంత క్రేజ్ గా మారాయో వేరే చెప్పాల్సిన పనిలేదు.

Harish Rao : ఇదిగో నా రాజీనామా లేఖ.. రేపు అక్కడకు వస్తా

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. తాను రేపు అమరవీరుల స్థూపం వద్దకు వస్తున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా రావాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీతో పాటు గ్యారంటీలను కూడా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని తెలిపారు.

Kesineni Nani : అందుకే నేను టీడీపీకి గుడ్ బై చెప్పా

చంద్రబాబు ఒక యూటర్న్ మాస్టర్ అని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. పక్కా వ్యాపారి చంద్రబాబు అని అన్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చంద్రబాబు పై కేశినేని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు, సుజనా చౌదరి ఇద్దరికీ రాజకీయం అంటే వ్యాపారమేనని ఆయన అన్నారు.

IPL 2024 : దేవుడా... ముందుగా మాత్రం బ్యాటింగ్ రాకుండా చూడు సామీ

ఐపీఎల్ లో ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ హిస్టరీని క్రియేట్ చేన్తున్న ఆరెంజ్ ఆర్మీ మరోసారి తన బ్యాట్ కు పనిచెబుతుందా? అన్నది ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చనీయాంశమైంది. అసలే అది ఉప్పల్ స్టేడియం. అచ్చొచ్చిన వేదిక. అందులోనూ హోం గ్రౌండ్.

Ys Jagan : వైఎస్ జగన్ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

వైఎస్ జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు ఎన్నికల అఫడవిట్ లో చూపించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆస్తులు 119 కోట్ల రూపాయలు, స్థిరాస్థులుగా 31 కోట్ల రూపాయలున్నాయని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

Revanth Reddy : బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు ఖాయం

పదేళ్ల పాటు మోదీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంబానీ, అదానీలకు మాత్రమే ఆయన ఉపయోగపడ్డారన్నారు. బీజేపీ సర్కార్ పై గాంధీభవన్ లో నయవంచన పేరుతో కాంగ్రెస్ ఛార్జిషీటు విడుదల చేసిన సందర్భంలో ఆయన మాట్లాడారు.


Tags:    

Similar News