8May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఎయిర్ ఇండియాకు సీనియర్ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. సామూహికంగా సెలవు తీసుకున్నారు. సిక్ లీవ్ పై వెళుతున్నట్లు తెలపడంతో ఎయిర్‌ఇండియాకు చెందిన 70 విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారు ఏం చేయలేక ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.

Update: 2024-05-08 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Air India : సిక్ లీవులో ఎయిర్ ఇండియా సిబ్బంది.. 70 విమానాలు రద్దు

ఎయిర్ ఇండియాకు సీనియర్ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. సామూహికంగా సెలవు తీసుకున్నారు. సిక్ లీవ్ పై వెళుతున్నట్లు తెలపడంతో ఎయిర్‌ఇండియాకు చెందిన 70 విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారు ఏం చేయలేక ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.

Ys Sharmila : షర్మిలకు సొంత బంధువులే సహకరించడం లేదా... మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే?

కడప జిల్లాలో వైఎస్ షర్మిలకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైఎస్ కుటుంబీకులు మాత్రమే కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలనున్న వారు ఎవరూ ఆమెకు సహకరించడం లేదని తెలుస్తోంది. షర్మిల కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు.

D.L. Ravindra Reddy : రెస్ట్ మోడ్ లోకి డీఎల్.. ఇక ఎవరు పట్టించుకుంటారయ్యా?

ఎన్నికల నామినేషన్ల ముందు వరకూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి యాక్టివ్ గా కనిపించారు. అధికార వైసీపీని ఓడించాల్సిందేనంటూ ఆయన మీడియా సమావేశాలు పెట్టి మరీ పిలుపు నిచ్చారు. జగన్ ను ఓడించి తీరుతానని శపథం చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.

Hyderabad :ఈ మాత్రం గాలికే గంటలు గంటలు కరెంట్ తీస్తే ఎలా? సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్న నెటిజన్లు

గతంలో ఎంత పెద్ద ఈదురుగాలులు వీచినా గంటకు మించి పెద్దగా విద్యుత్తు సౌకర్యానికి అంతరాయం ఏర్పడేది కాదు. కానీ నిన్న రాత్రి మాత్రం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకూ అనేక ప్రాంతాల్లో విద్యుత్తు అనేది లేకుండా పోయింది. ఈదురుగాలులు బలంగా వీచాయని అనుకుంటే గతంలోనూ ఇంతకంటే ఎక్కువ స్థాయిలో గాలులు వీచాయి. అయితే నిన్న అరగంట సేపు మాత్రమే ఈదురు గాలులు వీచాయి.

IPL 2024 : అందుకే ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు బ్రదర్.. ఢిల్లీకి అదిరేటి విజయం

ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఎన్నో వింతలు విశేషాలు. తక్కువ చేసి జట్టును చూస్తే అది పొరపడినట్లే. తమ విజయానికి ఢోకా లేదనుకున్న జట్లు కూడా విజయం ముంగిట బోల్తా పడుతున్నాయి. ఆషామాషీగా తీసుకోవడానికి ఏ జట్టు ఇందుకు అతీతం కాదు. ప్రతి జట్టులోనూ ఎవరో ఒకరు విజృంభించి ఆడతారు. అలాగే బౌలర్లు చెలరేగిపోతారు. అంతే చేతికి వస్తుందని భావించిన మ్యాచ్ చేజారిపోతుంది. 

రేవంత్ .. చిల్లర రాజకీయాలు చేయొద్దు : కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ తో ములాఖత్ అయ్యారు. ఆయనను పరామర్శించారు. అనంతరం జైలు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపడం అలవాటుగా రేవంత్ రెడ్డి మార్చుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే క్రిశాంక్ పెట్టిన సర్య్కులర్ నిపుణుల ముందు ఉంచడానికి రెడీనా అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

Ys Sharmila : మోదీకి గిఫ్ట్‌ పంపిన వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోడీకి రేడియో బహుమతిగా పంపారు. ఏపీ ప్రజల మన్ కి బాత్ మీరు వినండి అంటూ ఆమె రేడియోను మోదీకి పంపారు. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్న వైఎస్ షర్మిల ముందు మీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్ళీ కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు.

Narnedra Modi : పెద్దిరెడ్డికి పక్కా ట్రీట్ మెంట్ ఇస్తామన్న నరేంద్ర మోదీ

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీలేరులో నియోజకవర్గంలో కలికిరిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కావడం ఖాయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే మోడీ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆయన పిలుపు నిచ్చారు.

ఏబీపై సస్పెన్షన్ ఎత్తివేత.. జగన్ సర్కార్ కు క్యాట్ ఝలక్

మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ ఎత్తి వేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్ లో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. రెండోసారి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టింది.

Breaking : బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి ఏడుగురు మరణించారు. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో గోడకూలి ఏడుగురు మరణించారు. నిన్న కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఒక ఇంటి గోడ కూలింది. అయితే ఇల్లు కూలిందని తెలియడంతో అధికారులు రాత్రి నుంచి సహాయక చర్యలు ప్రారంభించారు.



Tags:    

Similar News