Thu Mar 19 2026 03:53:05 GMT+0530 (India Standard Time)
Breaking : బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి ఏడుగురు మరణించారు.

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి ఏడుగురు మరణించారు. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో గోడకూలి ఏడుగురు మరణించారు. నిన్న కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఒక ఇంటి గోడ కూలింది. అయితే ఇల్లు కూలిందని తెలియడంతో అధికారులు రాత్రి నుంచి సహాయక చర్యలు ప్రారంభించారు.
శిధిలాల నుంచి...
ఈరోజు ఉదయం శిధిలాల నుంచి ఏడుగురు మృతదేహాలను తీశారు. మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు ఇంకా సహాయక చర్యలు చేపట్టారు. గాలి, వాన కారణంగానే అక్కడ ఇంటి గోడ కూలడంతో ఏడుగురు మరణించారని తెలిసింది. మృతదేహాలను పోస్టు మార్టంకు తరలిస్తున్నారు. స్థానికులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Next Story

