టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-02-07 13:38 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని మొదటి అంతస్థులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరగడంతో నిలోఫర్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకుంది. అక్కడ ప్రజలు పొగతో ఇబ్బంది పడుతున్నారు.

Jasprit Bumrah : భారత్ కు దొరికిన అదృష్టం అందుకే బుమ్రా అంటే అంత క్రేజ్

ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్‌లో జస్ప్రిత్ బుమ్రా నెంబర్ వన్ గా నిలిచాడు. ఇంగ్లండ్ తో ముగిసిన రెండు టెస్ట్‌లు తర్వాత ఈ ఘనతను సాధించాడు. తొలి రెండు మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో వీర విహారం చేశారు. ప్రత్యర్థి ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కను రెప్ప మూసి తెరిచే లోగా వెనకాల ఉన్న వికెట్లు ఎగిరిపడటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆశ్చర్యానికి గురయ్యారంటే బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Breaking : ముఖ్యమంత్రికి కోర్టు సమన్లు.. ఈసారి హాజరు కాక తప్పదా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో విచారణ జరిపేందుకు ఈడీ ఐదు సార్లు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు.

 

Telangana : ఆరోజు ఆటోలు అంతటా బంద్.. ఎందుకంటే?

తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగనున్నారు. ఈ నెల 16వ తేదీన ఆటోలు బంద్ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆటోలను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో తమకు ఉపాధి కరువైందని వారు గత కొంతకాలంగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.


AP Budget : 2.86 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బుగ్గన

శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2.86,389 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రెండు లక్షల ముప్ఫయి వేల నూట పది కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా చూపించారు ద్రవ్యలోటును 55,817 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ లోటు 24,758 కోట్ల రూపాయలు అని ఆర్థిక మంత్రి చెప్పారు.


అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ.. ఎగుమతుల్లో 6వ స్థానం

ఆంధ్రప్రదేశ్ స్థూల ఆర్థిక వ్యవస్థ

1. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.

2. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం ప్రస్తుత ధరల ప్రకారం 16.22% GSDP వృద్ధిని నమోదు చేసింది


Andhra Pradesh : కోడికూర.. చేపల పులుసు.. రారమ్మని పిలుస్తున్న పార్టీ కార్యాలయాలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు ప్రజలకు చేరువయ్యేందుకు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో విందుభోజనాలు ఒకటి. ప్రధానంగా కోనసీమ జిల్లాల్లో ఇలాంటి విందుభోజనాలు ఎక్కువయ్యాయి. 


ప్రధాని సూచన మేరకు రకుల్ పెళ్లి వేదిక మార్పు

Rakul Preet Singh Marriage venue:టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఇక్కడే జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు విదేశాల్లో కాకుండా స్వదేశంలోనే పెళ్లి చేసుకునేందుకు ఆ జంట ఫిక్స్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ తో బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నానీతో పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. తొలుత ఈ వెడ్డింగ్ ను విదేశాలలో చేసుకుందామని భావించింది ఈ జంట.


RevanthReddy : రేవంత్ టీం గుట్టుగా పనిపూర్తి చేస్తుందా... బీఆర్ఎస్ కు షాకులు తప్పవా?

నాడు కేసీఆర్ సెట్ చేసిన ట్రెండ్ నే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లు కనపడుతుంది. 2014 నుంచి 2023 వరకూ కాంగ్రెస్ ను బలహీన పర్చేందుకే కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందుకోసం ఆయన ఒకదశలో బీజేపీ బలోపేతం కావడానికి కూడా అవకాశమిచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను వరసబెట్టి తన పార్టీలో చేర్చుకుని కండువాలు కప్పేసి శాసనసభలో నోరు మెదపకుండా చేసి ఇటు పెద్దల సభకు పంపాలన్నా, మండలికి ఎంపిక చేయాలన్నా మరే పార్టీకి అవకాశమివ్వకుండా చేయగలిగారు.


 దుంప తెగ.. ఇన్ని ఆస్తులా... ఎలా సంపాదించవురా సామీ... అవి చేతులేనా?

రెరా డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒకటా రెండా.. అతని ఆస్తుల విలువ 250 కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోనే కాదు విశాఖలోనూ మనోడు ఆస్తులను కూడబెట్టేశాడు. దొరికిన కాడికి భూములు, భవనాలు సొంతం చేసుకున్నాడు.

Tags:    

Similar News