Wed Jan 28 2026 10:28:16 GMT+0000 (Coordinated Universal Time)
Rakul Preet Singh Marriage venue: ప్రధాని సూచన మేరకు రకుల్ పెళ్లి వేదిక మార్పు
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఇక్కడే జరగనుంది. ప్రధాని పిలుపు మేరకు ఈ జంట నిర్ణయాన్ని మార్చుకుంది

Rakul Preet Singh Marriage venue:టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఇక్కడే జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు విదేశాల్లో కాకుండా స్వదేశంలోనే పెళ్లి చేసుకునేందుకు ఆ జంట ఫిక్స్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ తో బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నానీతో పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. తొలుత ఈ వెడ్డింగ్ ను విదేశాలలో చేసుకుందామని భావించింది ఈ జంట. కానీ మనసు మార్చుకుని చివరకు గోవాలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన గోవాలో వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి.
గోవాలో ఏర్పాటు...
ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు సిద్ధమయ్యారు. అయితే ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లడంతో మాల్దీవుల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇతర దేశాలకు కాకుండా స్వదేశంలోనే పెద్ద పెద్ద ఈవెంట్లు చేసుకోవాలన్న ప్రధాని సూచనను పరిగణనలోకి తీసుకున్న ఈ జంట గోవాకు తమ పెళ్లి వేదికేను మార్చుకుంది. సెలబ్రిటీలందరూ ఇలా విదేశాలకు వెళ్లకుండా స్వదేశంలో చేసుకోవడం వల్ల ఆర్థికంగా కూడా దేశానికి ప్రయోజనమంటున్నారు.
Next Story

