Mon Mar 16 2026 00:11:58 GMT+0530 (India Standard Time)
Road Acciddent : కారు లోయలోపడి.. ముగ్గురి మృతి
ఉత్తరాఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాల్వలో పడి ముగ్గురు మరణించారు

ఉత్తరాఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాల్వలో పడి ముగ్గురు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని డెహరాడూన్ ఈ ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ ను వికాస్ నగర్ లో కాల్వలో పడగా అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మరణించారు. కారులో ఉన్నవారంతా హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారే. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ఉన్నారు.
అతి వేగంతో...
అందులో ముగ్గురి వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.
Next Story

