కేసీఆర్ కామెంట్స్ కు జానారెడ్డి కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చారంటున్నారని, తమ పార్టీనే [more]

Update: 2021-04-15 05:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చారంటున్నారని, తమ పార్టీనే చావు నోట్లో పెట్టి తెలంగాణ ఇచ్చామని జానారెడ్డి అన్నారు. తన హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదని కేసీఆర్ అన్న వ్యాఖ్యలకు తానే మండల వ్యవస్థను తెచ్చానని జానారెడ్డి చెప్పారు. తాను ఏనాడు మంత్రిపదవిని, ఎమ్మెల్యే టిక్కెట్ ను కూడా కోరుకోలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ పదవులను ఆశించి పనిచేయలేదని జానారెడ్డి అన్నారు. తాము మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే సోనియా తెలంగాణ ఇచ్చారని, తన ఇంట్లోనే తెలంగాణ జేఏసీ పుట్టిందని జానారెడ్డి గుర్తు చేశారు.

Tags:    

Similar News