సూసైడ్ లేఖ రాశారా?

కోడెల శివప్రసాద్ మరణం చుట్టూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కోడెల ఎలా మరణించారన్న దానిపై చర్చ జరుగుతుంది. డేరింగ్ డేషింగ్ గల నేతగా కోడెల శివప్రసాద్ గుండెనిబ్బరం [more]

Update: 2019-09-16 08:46 GMT

కోడెల శివప్రసాద్ మరణం చుట్టూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కోడెల ఎలా మరణించారన్న దానిపై చర్చ జరుగుతుంది. డేరింగ్ డేషింగ్ గల నేతగా కోడెల శివప్రసాద్ గుండెనిబ్బరం ఉన్న నాయకుడు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన అభిమానులు చెబుతున్నారు. కేసులు చుట్టుముడుతున్నా ఆయన మనో నిబ్బరం కోల్పోరని అంటున్నారు. కోడెల జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడెల గదిని తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సూసైడ్ నోట్ ఏదైనా లభ్యమవుతుందేమోనని తనిఖీలు చేస్తున్నారు. వైద్యుల పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కోడెల మరణం అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. కొందరు గుండెపోటుతో చనిపోయారని అంటుంటే.. మరికొందరు విషప్రయోగం చేసుకున్నారని అంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. కోడెల సూసైడ్ నోట్ కూడా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కోడెల మరణాన్ని అనుమానాస్పదంగా పోలీసులు నమోదు చేశారు.

Tags:    

Similar News