IPL 2024 : లక్ష్యం చిన్నదైనా.. క్యూ కట్టిన పంజాబ్ కింగ్స్.. చెన్నైదే చివరకు విజయం

చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. చివరకు చెన్నై విజయం సాధించింది

Update: 2024-05-05 13:36 GMT

చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అది స్వల్ప లక్ష్యమే. పంజాబ్ కింగ్స్ కు అది పెద్ద స్కోరు కాదు. చెన్నైకు మరో ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తుందన్న నమ్మకంతో ఆ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే చెన్నైకి వరస ఓటములు ఆజట్టును కొంత కుంగదీస్తున్నాయి. ఈ పరిణామాలు పంజాబ్ కింగ్స్ కు అనుకూలంగా మారే అవకాశాలున్నాయని అందరూ అంచనాలు వేశారు. కానీ అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విజృంభించారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. ఛేదించాల్సిన లక్ష్యం పెరుగుతుండటం.. బంతులు తగ్గుతుండటంతో చెన్నై విజయం ఖాయమనిపించింది. చివరకు అదే జరిగింది. ప్లే ఆఫ్ లో ఆశలను సజీవంగా ఉంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసి...
అజింక్య రహానే తొమ్మిది పరుగులు చేసి అవుటయ్యాడు. క్రీజులో మిచెల్, రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడుతూ ఇద్దరూ కలసి యాభై పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నిలిపారు. తర్వాత వరసగా వికెట్లు కోల్పోయాయి. రుతురాజ్ 32 పరుగుల వద్ద అవుట్ కాగా, శివమ్ దూబె డకౌట్ అయ్యాడు దీంతో క్రీజులోకి మొయిన్ ఆలీ వచ్చాడు. తర్వాత మిచెల్ 30 పరుగుల వద్ద అవుటయ్యాడు. జడేజా, మొయిన్ ఆలీ ఇన్నింగ్స్ ను సరిదిద్దుతారనుకుంటే మొయిన్ ఆలీ కూడా పదిహేడు పరుగుల వద్ద అవుటయ్యాడు. జడేజా 43 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో చెన్నై తొమ్మిదో వికెట్ కోల్పోయినట్లయింది. చివరకు 9 వికెట్లు కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ 167 పరుగులు మాత్రమే చేసింది.
వరస బెట్టి..
168 లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెయిర్ స్టో ఏడు పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో ఓవర్ లోనే రిలీ రోసోవ్ కూడా డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ లు నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. పవర్ ప్లేలో ఇద్దరూ పరుగులను బాగానే రాబట్టారు. కానీ తర్వాత వరసగా వికెట్లు పడ్డాయి. ప్రభ్‌మన్ సింగ్ ఏడు పరుగుల వద్ద అవుటయ్యాడు. శశాంక్ సింగ్ కూడా 27 పరుగుల వద్ద అవుట్ కావడంతో పంజాబ్ ఈ స్కోరును అధిగమించడం కష్టమేనన్న అంచనాలు వినిపించాయి. జడేజా బౌలింగ్ లో బ్యాటర్లు వెనుదిరిగారు. ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీసుకుని పంజాబ్ వెన్ను విరిచాడు. అయితే పంజాబ్ వరసగా  కీలకమైన వికెట్లు కోల్పోయింది. చివరలో చాహర్ కొంత మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది.  దీంతో పంజాబ్ ఓటమిపాలయింది. 29 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.


Tags:    

Similar News