కేంద్ర బడ్జెట్ లో కీలక అంశాలివే..!

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇవాళ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా, రైతులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా బడ్జెట్ ను రూపొందించారు. బడ్జెట్ [more]

Update: 2019-02-01 07:45 GMT

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇవాళ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా, రైతులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా బడ్జెట్ ను రూపొందించారు. బడ్జెట్ లో ప్రకటించిన ముఖ్య అంశాలు ఓసారి చూద్దాం…
– ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లోకే జమా
– ఆదాయ పన్ను పరిమితి రూ. 2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
– గృహరుణాలు, ఇంటి అద్దెలు, ఇన్సురెన్సులతో కలిపి రూ.6.5 లక్షల వరకు పన్ను మినహాయింపు
– టీడీఎస్ పరిమితి రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంపు
– స్టాండర్ట్ డిడక్షన్ పరిమితి రూ.40 వేల నుంచి 50 వేలకు పెంపు
– 60 ఏళ్లు నిండిన అసంఘటిత కార్మికులకు నెలకే రూ.3 వేల పింఛన్
– రూ.21 వేల వేతనం వచ్చే వారికి కూడా ఈఎస్ఐ అమలు
– అంగన్ వాడీ సిబ్బంది వేతనాలు 50 శాతం పెంపు
– సినిమాల నిర్మాణానికి సింగల్ విండో అనుమతి విధానం, సినిమా టిక్కట్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు
– రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు

Tags:    

Similar News